188 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై రష్యా దాడి

76చూసినవారు
188 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై రష్యా దాడి
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి రెచ్చిపోయింది. 188 డ్రోన్లతో విరుచుకుపడింది. రాత్రి వేళ మొత్తం 17 ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్టు ఉక్రెయిన్‌ వైమానిక దళం ప్రకటించింది. అయితే, వీటిలో చాలా డ్రోన్లను అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దాడి కారణంగా భవనాలు, జాతీయ పవర్‌గ్రిడ్‌తో సహా కీలక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్