వనపర్తి జిల్లా కేంద్రంలో కుండపోత వర్షానికి శనివారం వనపర్తి మున్సిపల్ కార్యాలయం సమీపంలో మురుగు కాలువ పొంగిపొర్లింది. మురుగు నీరు రోడ్డుపై ప్రవహించింది. రోడ్డు పైకి కూడా నీరు చేరడంతో ఇబ్బందులు పడ్డారు. నీరు రోడ్డుపైకి రాకుండా ప్రయత్నించిన ఫలితం దక్కలేదు. కాలువ నిర్మాణంలో లోపం, డ్రైనేజీ పూడిక తీయకపోవటం, ప్రజలు చెత్తాచెదారాన్ని కాలువలోనే వేయటం దీనికి కారణమని, మురుగు కాలువల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.