ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి 1.11 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 1.90 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.90 అడుగులకు చేరింది. వరద ప్రవాహం పెరగడంతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. దీంతో 12 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 97 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.