వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మణిగిళ్లలో ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆదర్శ్ సురభి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు కల్పించిన వసతులు పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రతి వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం శుభ్రం చేసుకోడానికి ఫ్యాన్లు ఉండాలని, నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు. తూకంలో తేడా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.