వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తండ్రి నిరంజన్ ఆచారి అనారోగ్య కారణాలతో మంగళవారం ఉదయం హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందాడు. ఆయన స్వస్థలం కరీంనగర్. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు రావుల గిరిధర్ ప్రస్తుతం వనపర్తి జిల్లా ఎస్పీగా కొనసాగుతున్నారు. నిరంజన్ ఆచారి మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.