ఆశా వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి డిమాండ్ చేశారు. మంగళవారం వనపర్తిలో జిల్లా సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశావర్కర్లు ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకొని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ. ఆశా వర్కర్లకు స్థిరవేతనం రూ. 18 వేలు చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినహామీలను అమలు చేయాలని లేకుంటే పెద్దఎత్తున ఆందోళన చేపడతామన్నారు.