వనపర్తి జిల్లా రేవల్లి మండలం తలుపునూరులో వరి నెల రోజులు ఆలస్యంగా సాగు చేయటంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వస్తోంది. ధాన్యం రాశులతో కొనుగోలు కేంద్రాలు కళకళలాడుతున్నాయి. శుక్రవారం తలుపునూరు గ్రామ రైతులు మాట్లాడుతూ. వనపర్తి జిల్లాలో ఇతర ప్రాంతాల కంటే రేవల్లి మండలం పలుగ్రామాలలో నెల రోజులు వరి పంట ఆలస్యంగా వేస్తారని, ఆలస్యంగా ధాన్యం కేంద్రాలకు వస్తోందన్నారు. నిర్వాహకులు కొనుగోలులో వేగం పెంచారన్నారు.