డాలర్ ప్రచారకర్తగా మహేశ్ బాబు

82చూసినవారు
డాలర్ ప్రచారకర్తగా మహేశ్ బాబు
ప్రముఖ దుస్తుల సంస్థ డాలర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తాజాగా తెలుగు హీరో మహేశ్ బాబును ప్రచారకర్తగా నియమించుకున్నది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ వినోద్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల్లో విక్రయాలు 50 శాతం వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నట్లు, ఇందుకోసం 50 ఔట్‌లైట్లను ప్రారంభించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. రాబోయే రెండేళ్లలో సంస్థ మొత్తం ఆదాయాన్ని రూ.2,000 కోట్లకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్