ఓట్స్ తో సూప్ తయారీ చాలా సింపుల్

84చూసినవారు
ఓట్స్ తో సూప్ తయారీ చాలా సింపుల్
ఓట్స్ తో సూప్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం. ఒక గిన్నెలో నూనె వేడి చేసి ఉల్లి, పచ్చిమిర్చి, వెల్లుల్లిలను వేసి వేగించాలి. ఓట్స్ వేసి రెండు నిమిషాలు వేగించాక ఉప్పు వేసి, నీళ్లు పోసి ఉడికించాలి. పాలు, మిరియాలపొడి వేసి ఒక ఉడుకు రానివ్వాలి. చివరగా కొత్తిమీరను అలంకరించి వేడివేడిగా తాగేయాలి. వేగించిన బ్రెడ్ ముక్కలను నంజుకుంటూ తాగితే యమ్మీగా ఉంటుంది. కావాలంటే క్యారెట్, పచ్చిబఠాణీ వంటివి కూడా వేసుకోవచ్చు. ఇందులో చిటికెడు గరం మసాలా లేదా జీలకర్ర పొడి వేసుకుని తాగితే ఇంకా రుచిగా ఉంటుంది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్