తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సీరోల్ మండల పరిధిలోని బూరుగుచెట్టు తండా జీపీలోని మాంజాతండాలో మంగళవారం రాత్రి మాంసం కూడా చేయలేదని మాలోత్ కళావతి (38)ని భర్త బాలు తీవ్రంగా కొట్టాడు. దీంతో కళావతి అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.