యూపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మథుర జిల్లాకు చెందిన ఉమేష్ (28) అనే వ్యక్తి ఆడవేషంలో.. పెళ్లైన ప్రియురాలు రేఖ (30) ఇంటికి వెళ్లి, తనతో రావాలని బలవంతం చేశాడు. అందుకు ఆమె నిరాకరించడంతో పెట్రోల్ పోసి నిప్పంటించి టెర్రస్ మీద నుంచి కిందకు దూకి గాయపడగా, రేఖ 70% కాలిపోయింది. ఈ ఘటనతో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.