ప్రైవేటు ట్రావెల్‌ బస్సు ఢీకొని వ్యక్తి మృతి (వీడియో)

556చూసినవారు
HYD: జీడిమెట్ల పరిధి షాపూర్‌నగర్‌ చౌరస్తాలో ప్రైవేటు ట్రావెల్‌ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. బుధవారం ఉదయం రహదారి దాటుతున్న వ్యక్తిని వేగంగా దూసుకొచ్చిన ఓ ప్రైవేటు ట్రావెల్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్