TG: సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చివ్వెంల మండలం లక్ష్మీ తండాకు చెందిన ధరవాత్ శేషు (39) అనే వ్యక్తిని.. తన స్నేహితులు న్యూ ఇయర్ వేడుకలకు పిలిచి గొంతుకోసి హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.