బెల్లంపల్లి పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో సోమవారం క్రిస్మస్ వేడుకల్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ హాజరయ్యారు. చర్చిలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. క్రైస్తవ సోదరులకు ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ ఏసుక్రీస్తు దీవెనలు ఉండాలని ఆయన వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతర స్వామి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.