కన్నెపల్లి: మెట్పల్లి గ్రామంలోని అంగన్వాడీకేంద్రం1లో బుధవారం తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూపర్వైజర్ ఇందిరా మాట్లాడుతూ, బిడ్డ జన్మించిన గంటలోపే వారికి ముర్రుపాలు పట్టించడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తెలియచేసి, తల్లిపాల గురించి తల్లులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్, కార్యదర్శి, అంగన్వాడీటీచర్ మాలతి, ఆయా, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.