కన్నెపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతున్న క్రమంలో శుక్రవారం కలెక్టర్ సాయి దీపక్ ఐఏఎస్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో భాగంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇండ్ల సర్వేని త్వరితగతిన పూర్తి చేయాలని సమాచారాన్ని పొందుపరచాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ రాజ్ కుమార్, ఎంపీడీవో శంకర్, గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.