గురుకుల పాఠశాలల పని వేళలను శాస్త్రీయంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ యూటిఎఫ్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల, సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. గురుకుల పాఠశాలల పని వేళలు విద్యార్థుల మానసిక వికాసానికి తగిన విధంగా ఉంచాలని బుధవారం పేర్కొన్నారు.