బెల్లంపల్లి అభివృద్ధికి తోడ్పాటును అందించాలి

57చూసినవారు
బెల్లంపల్లి అభివృద్ధికి తోడ్పాటును అందించాలి
పెద్దపల్లి జిల్లాలో పలు ప్రారంభోత్సవాలకు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి నిధులు కేటాయించాలని, నిలిచిపోయిన చెక్కులు క్లియర్ అయ్యేవిధంగా చూడాలని కోరినట్లు ఆమె పేర్కొన్నారు. ఆమెతో పాటు కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్