బాణసంచా దుకాణదారులు తప్పనిసరిగా సంబంధిత ప్రభుత్వ శాఖల అనుమతులు తీసుకోవాలని భీమారం ఎస్సై శ్వేత తెలిపారు. భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో దీపావళి సందర్భంగా చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా అనుమతి లేకుండా బాణసంచా ఇళ్లల్లో, షాపులలో, జన సముదాయాల మధ్య గోదాములలో నిల్వ చేసిన, లైసెన్స్ లేకుండా అనధికార విక్రయాలు జరిపిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.