నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి అన్నారు. మందమర్రి పట్టణంలోని అంగడి బజార్ ఏరియాలో మంగళవారం పోలీసులు కార్డెన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 34 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని ఆయన వెల్లడించారు.