రామకృష్ణాపూర్ శ్రీ కోదండ రామాలయంలో అయ్యప్ప మాల ధరించిన స్వాములు బుధవారం శబరిమలై పయనమయ్యారు. ఉదయం అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గురుస్వాములు మాలదారులకు ఇరుముళ్ళు కట్టారు. 41 రోజులు మండల దీక్ష పూర్తి చేసుకున్న స్వాములు నేడు శబరిమలై పయనం కావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. అర్చకులు పురుషోత్తం అయ్యప్ప మాలదారులకు భిక్షను ఏర్పాటు చేయగా శరనుగోశతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది.