మాజీ సర్పంచ్ కు నివాళి
కాసిపేట మండలంలోని మాజీ సర్పంచ్ బన్న ఆశాలు కుటుంబ సభ్యులను చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. బన్న ఆశాలు ఇటీవల మృతి చెందగా ఆయన గృహానికి వెళ్లిన ఎమ్మెల్యే ఆశాలు చిత్రపటం వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, కాంగ్రెస్ పార్టీ కాసిపేట మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్, నాయకులు ఉన్నారు.