లక్షేటిపేట్: భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
లక్షేటిపేట్ మున్సిపాలిటీలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాల భవన పనులను మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు శుక్రవారం పరిశీలించారు. నిర్మాణ పనులను నాణ్యత లోపం లేకుండా, త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మంచిర్యాల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.