సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల శివారులో సోమవారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. బైక్ పై వెళ్తున్న నూతన దంపతులు ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. వెల్లటూరు గ్రామానికి చెందిన గుండవరపు రత్నకుమారికి.. మిర్యాలగూడ(M) తడకమళ్ళకు చెందిన ఉపేంద్రతో గత శుక్రవారం వివాహం జరిగింది. సోమవారం ఆమె తల్లిగారింటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.