పెన్సింగ్ పోల్స్ తొలగించిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు. దహేగాంకి చెందిన చిలువేరు మణికంఠ, క్రిష్ణారెడ్డి ఎకరం భూమి చుట్టూ సోమవారం పెన్సింగ్ పోల్స్ వేశారు. అదేరోజు రాత్రి మండల కేంద్రానికి చెందిన భూతే నాగరాజు, జునగరి గణపతి, మరో ఇద్దరు వాటిని తొలగించారు. దీంతో కమలాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేశామని ఎస్సై వివరించారు.