మంచిర్యాల: క్యాన్సర్ వ్యాధిపై విద్యార్థులకు అవగాహన

58చూసినవారు
మంచిర్యాల: క్యాన్సర్ వ్యాధిపై విద్యార్థులకు అవగాహన
జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల, లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో జైపూర్ లోని సాంఘిక సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ చైర్ పర్సన్ వి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు వివరించారు.

సంబంధిత పోస్ట్