మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోటపల్లి మండలంలోని రాపాన్ పల్లి అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను సోమవారం రామగుండం సీపీ ఎం. శ్రీనివాస్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న పోలీసులు అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. అక్రమంగా డబ్బు, మద్యం, బంగారం ప్రజలను ప్రలోభాలకు గురి చేసే విలువైన వస్తువులు తరలిస్తే పట్టుకోనున్నట్లు తెలిపారు. డీసీపీ భాస్కర్ పాల్గొన్నారు.