సబ్బెపల్లి ఉన్నత పాఠశాలలో గణిత దినోత్సవ వేడుకలు

778చూసినవారు
సబ్బెపల్లి ఉన్నత పాఠశాలలో గణిత దినోత్సవ వేడుకలు
మంచిర్యాల నియోజకవర్గం హాజీపూర్ మండలం సబ్బెపల్లి ఉన్నత పాఠశాలలో గణిత దినోత్సవ వేడుకలు గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా జేడ్పీహెచ్ఎస్ సబ్బెపల్లి ఉన్నత పాఠశాలలో గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్ చిత్రపటాన్ని పూలమాలతో అలంకరించి.. గణితానికి అతను చేసిన సేవలను గణిత ఉపాధ్యాయులు రాజశేఖర్ రత్నాకర్ లు విద్యార్థులందరికీ వివరించడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా గణితంలోని వివిధ అంశాలపై విద్యార్థుల రూపొందించిన వివిధ అభ్యసన సామాగ్రి చార్టులు పరికరాలు మొదలైన వాటితో గణిత ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గణిత ప్రదర్శనను పాఠశాల హెడ్మాస్టర్ పద్మజ ప్రారంభించడం జరిగింది. అలాగే వ్యాసరచన చిత్రలేఖనం వంటి పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్