రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమంపై ఎంపీపీ సమీక్ష

1642చూసినవారు
రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమంపై ఎంపీపీ సమీక్ష
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ లు, ఎంపీటీసీలు వైద్య సిబ్బందితో రెండవ విడత కంటివెలుగు కార్యక్రమంపై సమీక్ష సమావేశం ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. జనవరి 18 నుంచి కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి... కావున అందరూ సంసిద్ధంగా ఉండాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బాధితుల్లో అశలు చిగురిస్తున్నాయి. మొదటి విడత 2018 ఆగస్టు 15 నుంచి 2019 మార్చి 31 వరకు కంటివెలుగు కొనసాగగా మండల వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించి.. కంటి అద్దాలు వైద్య ఆరోగ్యశాఖ అందించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మల్లేష్, ఎంపీఓ సత్యనారాయణ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్