మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ అంగన్ వాడీ కేంద్రంలో మంగళవారం పోషణ మాసోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోషక పదార్ధాలతో రూపొందించిన ఐసీడీఎస్ చిహ్నం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంగన్ వాడీ టీచర్ కనుకుంట్ల తిరుమల మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు పోషక విలువతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల తాము ఆరోగ్యంగా ఉండడంతో పాటు పిల్లల ఎదుగుదలకు, మానసిక వికాసానికి ఎంతో మేలు చేకూరుతుందన్నారు.