అంబులెన్స్ డ్రైవర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

1566చూసినవారు
రోగులను కమిషన్లు ఇచ్చే ఆసుపత్రికి తరలిస్తున్న తోకల సాగర్ అనే అంబులెన్స్ డ్రైవర్ ను అరెస్ట్ చేసినట్లు మంచిర్యాల ఏసిపి ప్రకాష్ శుక్రవారం తెలిపారు. కరీంనగర్ లోని అకిరా హాస్పిటల్ తో ఒక్కో పేషెంట్ కు 25 శాతం నుండి 30 శాతం కమిషన్ ఇచ్చేలా ఒప్పందం చేసుకొని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారిని తన అంబులెన్స్ లో తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు అరెస్ట్ చేసి రిమాండ్ కోసం కోర్టులో హాజరు పరిచామని తెలిపారు.

సంబంధిత పోస్ట్