తాండూరు: జాతీయ రహదారిపై పశువులు
మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలోని 363 జాతీయ రహదారిపై నిత్యం పశువులు తిరుగుతుండడంతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు. జాతీయ రహదారికి ఇరువైపులా భారీకేడ్లు లేకపోవడంతోనే పశువులు రోడ్లపై సంచారిస్తున్నాయని, ఈ విషయమే జాతీయ రహదారి అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.