తాండూర్: మిట్ట చంద్రయ్య జ్ఞాపకార్థం బస్ షెల్టర్ నిర్మాణం

59చూసినవారు
తాండూర్: మిట్ట చంద్రయ్య జ్ఞాపకార్థం బస్ షెల్టర్ నిర్మాణం
తాండూర్ మండలం అచలాపూర్ గ్రామంలో మిట్ట చంద్రయ్య జ్ఞాపకార్థం గ్రామంలోని ఆటో స్టాండ్ వద్ద అల్లుడు ఈర్ల నారాయణ కుటుంబ సభ్యులు ప్రయాణికుల సౌకర్యార్థం బస్ షెల్టర్ నిర్మించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గట్టు మురళీధర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకరమ్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్