తాండూర్ మండలంలోని రేచిని గ్రామపంచాయతీ కొత్తచెరువు ను కబ్జా నుంచి కాపాడాలని అదే గ్రామానికి చెందిన భామండ్లపల్లి ఆనంద్ కోరారు. ఈ మేరకు ఎంపీడీవో కు ఫిర్యాదు చేశారు. కొత్తచెరువు 22. 93 ఎకరాల చెరువు భూమి ఉందని, చెరువు ఆయకట్టు కింద 56 ఎకరాలు సాగుతుందని పేర్కొన్నారు. చెరువులో నీరు ఉండడం వల్ల వ్యవసాయ భూములకు మత్స్య సంపదకు ఆటంకం లేకుండా నీరు అందుతుందన్నారు.