మాజీ ఎంపీ మందా జగన్నాథం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆయనకు నిమ్స్‌లో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. మందా జగన్నాథం కొంతకాలంగా కిడ్నీలు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నెల 26న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు నిమ్స్‌కు తరలించారు. ఇప్పటికే ఆయనను పలువురు నాయకులు పరామర్శించారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రవేశ్‌లో మూడు సార్లు నాగర్ కర్నూలు నుంచి ఆయన ఎంపీగా గెలిచారు.