ఎప్పటినుంచో ప్రపంచ దేశాలను హెచ్ఐవీ ఎయిడ్స్ వణికిస్తోంది. ఈ మహమ్మారి రాకుండా అడ్డుకునేందుకు వ్యాక్సిన్ల కోసం ప్రపంచ దేశాల్లో ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ సంవత్సరం 10 లక్షల మంది హెచ్ఐవీ ఎయిడ్స్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే ఎప్పటి నుంచో ఈ హెచ్ఐవీకి వ్యాక్సిన్లు, మందులు కనిపెట్టేందుకు ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో ప్రముఖ సంస్థలు, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఏళ్లుగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.