టర్కీలో భారీ బ్లాస్ట్... ఆరుగురి మృతి (వీడియో)

65చూసినవారు
టర్కీ దేశంలో భారీ పేలుడు సంభవించింది. టర్కీకి పశ్చిమాన ఉన్న ఇజ్మీర్ లో సోమవారం ఈ ఘటన జరిగింది. ఈ పేలుడులో ఆరుగురు మృతి చెందారు. మరో 63 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రాంతంలోని ఒక రెస్టారెంట్ కు సంబంధించిన ట్యాంక్లో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్