భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

64565చూసినవారు
భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర సరిహద్దు సమీపంలోని అబూజ్‌మడ్‌ అటవీ ప్రాంతంలో టేకేమాట వద్ద మంగళవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకరంగా కాల్పులు జరుగుతున్నాయి. DRG, STF సంయుక్త బృందాలు ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నాయి. ఎన్‌కౌంటర్ గురించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్