AP: జనాభా పెరుగుదలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో "పాపులేషన్ డైనమిక్ డెవలప్మెంట్" సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రసూతి సెలవులు ఎన్ని కాన్పులకైనా ఇస్తామని ఆయన ప్రకటించారు. సాధారణ ప్రసవాలు పెరగాలి, సిజేరియన్లు తగ్గాలన్నారు. ప్రభుత్వం కూడా జనాభా పెరుగుదలకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఎక్కువ మంది పిల్లలను కనాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.