AP: విజయవాడ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. వంగవీటి రాధా రాజకీయ సన్యాసం చేయనున్నట్లు తెలుస్తోంది. రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలతో పాటు, కుటుంబ కారణాలు ఉన్నాయని టాక్. పదవుల కోసం పాకులాడకుండా పార్టీలో పనిచేసినా తనకు గుర్తింపు లేదన్న వాదన ఒకవైపు వినిపిస్తుండగా, నిలకడలేని మనస్తత్వం వంటివి రాధా గ్రాఫ్‌కు అడ్డంకిగా మారాయని రాజకీయంగా చర్చ జరుగుతోంది.