AP: రాష్ట్రంలోని స్కూలు విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త అందించారు. ఇక ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించామని, టీచర్లకు కూడా దీనిపై శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి యూనిఫాం మారుస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. పిల్లల పుస్తకాల బరువు తగ్గించేందుకు ప్రయత్నిస్తామని, సెమిస్టర్ వారీగా పుస్తకాలు ఇస్తామని, ఒకటో తరగతికి రెండు పుస్తకాలే ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.