భారత్ సముద్రయాన్‌కూ చకచకా ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 12 గంటల వ్యవధిలో సముద్రంలో 6,000 మీటర్ల లోతుకు వెళ్లి బయటకు వచ్చేందుకు వీలుగా ఓ ప్రత్యేకమైన డైవింగ్ మెషీన్‌ను కూడా సిద్ధం చేసింది. దీనికి మత్స్య-6000 అని పేరు పెట్టింది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే సముద్ర లోతులను అన్వేషించగల సామర్థ్యం ఉన్న అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనాల క్లబ్‌లోకి భారత్ కూడా అడుగుపెడుతుంది.