అరటిని నులి పురుగులు ఆశిస్తే చెట్టు కింది భాగంలో మచ్చ ఏర్పడుతుంది. ఇవి వేరు విభాగంలో గుడ్లను పెడతాయి. గుడ్లు పొదిగిన తర్వాత లార్వా వేరు భాగాన్ని తినడం మొదలు పెడుతాయి. ఇలా దెబ్బతిన్న భాగాన్ని శిలీంధ్రాలు వేగంగా దాడి చేస్తాయి. అరటి గెలలో పండ్ల సంఖ్య తగ్గిపోతుంది. దీని నివారణకు అరటిని నాటే సమయలో కార్బోఫ్యూరాన్ 3G లేదా ఫోరేట్ 10 గ్రా. వాడాలి. 250-400 గ్రాముల వేపపిండిని వేయడం వల్ల చీడపీడల సంఖ్య తగ్గుతుంది.