కుమార్తెను లైంగికంగా వేధిస్తున్న భర్తను భార్య హత్య చేసిన సంఘటన చౌటకూరు మండలం సుల్తాన్పూర్ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. తండ్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చి కుమార్తెను లైంగికంగా వేధించారు. భర్తను భార్య గొడ్డలితో నరికి చంపింది. అనంతరం తల్లీ కూతుళ్లు పుల్కల్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.