అంగన్వాడి విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం
మెదక్ జిల్లా చిలిపి చేడ్ మండల్ ఫైజాబాద్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు అంగన్వాడీ కేంద్రం 2లో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రాథమికోన్నత పాఠశాల ఇన్ ఛార్జ్ హెడ్మాస్టర్ ఉమారాణి, అంగన్వాడి టీచర్ పిల్లల తల్లిదండ్రులు, వెలుగు, గ్రామైక సంఘం సభ్యులు పాల్గొన్నారు.