బీజేపీ మాజీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వినేష్ ఫోగట్ ఆ పార్టీ నేత రాహుల్ గాంధీపై కూడా లైంగిక వేధింపు ఆరోపణలు చేయవచ్చంటూ జోక్ వేశారు. తనపై చేసినట్లుగానే రాహుల్ గాంధీపై కూడా వినేష్ ఫోగట్ తప్పుడు లైంగిక వేధింపు ఆరోపణలు చేయవచ్చని వ్యాఖ్యానించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.