మండల వ్యాప్తంగా ఘనంగాసద్దుల బతుకమ్మ వేడుకలు

70చూసినవారు
మండల వ్యాప్తంగా ఘనంగాసద్దుల బతుకమ్మ వేడుకలు
నిజాంపేట మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం సాంప్రదాయ పద్ధతుల్లో మహిళలు గత రెండు మూడు రోజుల నుండి తంగేడు గునుగు పువ్వు లాంటి అడవి పూలను సేకరించిబతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకున్నారు. తిరొక్క పువ్వులతో బతుకమ్మను తీర్చిదిద్ది మహిళలు మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయం కూడలికి మహిళలందరూ చేరుకొని చిన్న పేద ధనిక తేడా లేకుండా అందరూ కలిసి లయబద్ధంగా బతుకమ్మల చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు ఆడుతూ పాడుతూ ఆడారు. అనంతరం బతుకమ్మలను పూజించి నిజాంపేట గ్రామ సమీపంలోని గడిమ్ చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేసి దీర్ఘ సుమంగళి గా ఉండాలని మహిళలు ఒకరికొకరు పసుపు కుంకుమలు పప్పు ఫలహారాలు ఇచ్చుపుచ్చుకుంటూ దీవెనలు అందుకుంటారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనూష, ఎంపీటీసీ లహరి రెడ్డి, గ్రామ మహిళలుతదితరులుశోభ, వినోద, వర్ష, స్వప్న, వెంకటవ్వ, లక్ష్మి, రజిత, బాల మనేమ్మ, అరుణ శ్రీ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్