తెలంగాణ తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమురయ్య 75వ వర్థంతి సభను మెదక్ జిల్లా హావేలి ఘనపూర్ మండలం శంనపూర్ లో గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిఎంపిఎస్ జిల్లా నాయకులు కె. మల్లేశం మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిపై పోరాటమే దొడ్డి కొమురయ్యకి నిజమైన నివాళి అని అన్నారు. దేశంలో ప్రజలను బానిస ఉబిలోకి నెట్టుతున్నారని బీజేపీపై ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని అన్నారు. కరోనాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే సుప్రీం కోర్ట్ మొట్టోకాయలు వేశదక స్పందించని సీఎం కేసీఆర్ ప్రజలను పాలించే అధికారం కేసీఆర్ కు లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీరయ్య, కుంటయ్య, దుర్గయ్య, బలమల్లు, సాయిలు, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.