కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గురించి ఎంతమాత్రం పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ ఆరోపించారు. మంగళవారం రామాయంపేటలోని దళితవాడలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. నెల రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ఇప్పటివరకు రైస్ మిల్లులు అలాట్ చేయకపోవడం సరికాదన్నారు. ప్రభుత్వం బేషరతుగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, వడ్ల తేమ శాతాన్ని 17 శాతం పెంచాలని డిమాండ్ చేశారు.