కరీంనగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం (మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్) పట్టభద్రులుగా ఉన్నవారు తమ ఓటును నమోదు చేసుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం మెదక్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2021 లోపు డిగ్రీ పూర్తి చేసిన వారు ఫారం 18ను నింపాలని, ఆన్ లైన్లో నమోదు చేసుకోవాలని కోరారు. ఆన్ లైన్ లో | www. ceotelangana. nic. in తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.